<span;>న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్(Times Square)లో దుర్గా ఉత్సవ్ కనులపండువగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భారతీయులు ఉత్సాహంగా పాల్గొన్నారు.అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజలు
నిర్వహించారు. కళాకారుల.. సంగీతం, సంప్రదాయ నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. యూఎస్ (USA)లోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రవాస భారతీయులు ఈ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు.ఈ కార్యక్రమానికి న్యూయార్క్ లో భారత కాన్సుల్ జనరల్ బినయా ప్రధాన్ హాజరయ్యారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు ఐదు దశాబ్దాలకు పైగా కృషి చేస్తున్న అమెరికాలోని ఆరు సంస్థలను ఈ సందర్భంగా సత్కరించారు.