ఏపీలో స్థానిక ఎన్నికలపై రాజకీయ పక్షాల నుంచి అభిప్రాయాలు సేకరించినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా వెల్లడించారు. పోటీచేసే అభ్యర్థులకు భద్రత ఇవ్వాలని రాజకీయ పక్షాలు కోరాయని చెప్పారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సంబంధిత విభాగాల నుంచి గెజిట్ నోటిఫికేషన్ రావాల్సి ఉందని, ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపిన తర్వాత ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తామని తెలిపారు.