లాటిన్ అమెరికా దేశమైన పనామాలో సోమవారం మళ్లీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.0గా నమోదైనట్లు యూరోపియన్-మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ (EMSC) వెల్లడించింది. తెలిపారు. కొద్ది రోజుల క్రితం (శుక్రవారం) పనామాలో 7.7 తీవ్రతతో భారీ భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. ఆ పెను ప్రమాదం కారణంగా సుమారు 900 భవనాలు నేలకూలగా, 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత ఇప్పటివరకు దాదాపు 300కు పైగా ప్రకంపనలు (ఆఫ్టర్షాక్స్) నమోదయ్యాయి.