loader

ఐఐటి విద్యార్థి ఆత్మహత్య కేసులో ప్రొఫెసర్‌కు క్లీన్‌చిట్?

ఐఐటి బాంబేలో విద్యార్థి సాహిల్ ఆత్మహత్య కేసులో ప్రొఫెసర్‌కు సంబంధం ఉన్నట్లు ఎలాంటి స్పష్టమైన ఆధారాలు లభించలేదని దర్యాప్తుతో ప్రత్యక్ష సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. విద్యార్థిపై ప్రొఫెసర్ కులవివక్ష వ్యాఖ్యలు చేసినట్లు వచ్చిన ఆరోపణలను బలపరిచే ప్రత్యక్ష సాక్షి లేదా ఇతర ఆధారాలు కూడా ఇప్పటివరకు లభించలేదని దర్యాప్తు అధికారులు తెలిపారు. పరీక్ష సమయంలో విద్యార్థి కాపీయింగ్‌కు పాల్పడినట్లు గుర్తించిన అనంతరం అతడిని పరీక్ష హాలు నుంచి బయటకు వెళ్లాలని ప్రొఫెసర్, పరీక్ష పర్యవేక్షకుడు సూర్యనారాయణ […]

‘దాదాసాహెబ్ ఫాల్కే’ పురస్కారం స్వీకరించిన అనంత్‌ నాగ్..!

సుప్రసిద్ధ నటుడు అనంత్ నాగ్ ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును స్వీకరించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఎక్తా నగర్‌లో మంగళవారం కన్నులపండువగా జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో ఆహుతుల కరతాళ ధ్వనుల మధ్య ఆయన సగర్వంగా ఈ పురస్కారాన్ని తీసుకున్నారు. సినిమాలు, టీవీ రంగంలో ఏడు దశాబ్దాలకుపైగా విశేష సేవలకుగానూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును స్వీకరించారు.

కూటమి బలంగా నిలబడాలి.. జనసేన గౌరవానికి భంగం వాటిల్లకూడదు

కూటమి ప్రభుత్వంలో అంతా కలిసికట్టుగా పనిచేయాలని, అదే సమయంలో ఎవరి గౌవరం తగ్గకూడదని.. జనసేన పార్టీ గౌరవానికి భంగం వాటిల్లకూడదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. తనకు కృతజ్ఞత చూపించేతత్వం చాలా ఎక్కువని, అది తన స్వభావం అన్నారు. వచ్చే 3, 4 నెలల్లో క్యాంప్ ఆఫీసు పిఠాపురానికి మార్చుతానని, జనసేన నాయ‌కులంద‌రికీ దిశా నిర్దేశం చేయాలన్నారు. ప‌ద‌వులు తీసుకున్న త‌రువాత మన నాయకులంతా మెత్త‌ప‌డ్డారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నిమ్స్ డాక్టర్ ఇంట ఏసీబీ దాడులు! 13 చోట్ల సోదాలు

నిమ్స్ వైద్యుడు, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నోరి లక్ష్మీభాస్కర్ నివాసం, కార్యాలయాలపై ఏసీబీ (ACB) దాడులు చేపట్టింది. ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో సోదాలు కొనసాగుతున్నాయి. ఎర్రగడ్డలో లక్ష్మీభాస్కర్ కు చెందిన కల్పతరువు అపార్ట్మెంట్స్ సహా ఆయన కుటుంబసభ్యుల నివాసాల్లోనూ సోదాలు జరుగుతున్నాయి. మొత్తం 13 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఏసీబీ అధికారులు బృందాలుగా ఏర్పడి సోదాలు కొనసాగిస్తున్నారు.

మహిళా క్రికెట్ జట్టుకు పసిడి పతకం.. ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ము ప్రశంసలు

ఆసియా క్రీడలలో భారత మహిళా క్రికెట్ జట్టు అద్భుత ప్రదర్శనతో, దేశానికి మొదటి బంగారు పతకాన్ని అందించింది. ఈ చారిత్రక విజయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ జట్టుకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. భారత క్రీడాకారిణుల ఆత్మవిశ్వాసం, నైపుణ్యం, సమష్టి కృషి అమోఘమని కొనియాడారు. ఈ విజయం దేశానికే గర్వకారణమని, యువ క్రీడాకారులకు ఇది గొప్ప స్ఫూర్తిగా నిలుస్తుందని ప్రశంసించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైతం భారత జట్టును అభినందిస్తూ.. ఈ విజయం క్రీడా చరిత్రలో నిలిచిపోతుందని, […]

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..

హైదరాబాద్ నగరంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. మంగళవారం సాయంత్రం నుంచి నగరవ్యాప్తంగా భారీ వర్షం దంచికొడుతోంది. ముఖ్యంగా సికింద్రాబాద్, ఖైరతాబాద్, చార్మినార్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వాన కురుస్తోంది. జూబ్లీహిల్స్, గోల్కొండ, శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షపాతం నమోదైంది. అకస్మాత్తుగా కురిసిన ఈ వానతో ఆఫీసుల నుంచి వెళ్లే ఉద్యోగులు ముప్పుతిప్పలు పడ్డారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దని నగర ప్రజలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

రూ.2700 క్యాన్సర్ మందు 27 వేలకు..! దోపిడీపై సుప్రీం తీవ్ర ఆగ్రహం..!

ఫార్మా కంపెనీలు రిటైలర్లకు విక్రయించే మందుల ధరలకు, ప్యాకెట్లపై ముద్రించే MRP కి మధ్య ఉన్న భారీ వ్యత్యాసంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తయారీదారుల నుంచి రిటైలర్లకు కేవలం రూ. 2,700లకే లభించే జీవన రక్షక క్యాన్సర్ వంటి ఔషధాలను, మార్కెట్లో ఏకంగా రూ. 27వేల ఎమ్మార్పీతో విక్రయించడం పట్ల తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ప్రాణాలు కాపాడుకోవడానికి ఇళ్లను, బంగారం అమ్ముకుంటున్నారని జస్టిస్ మెహతా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దోపిడీని అరికట్టడానికి […]

మామునూరు ఎయిర్ పోర్టుకు కొత్త పేరు సూచించిన ఓవైసీ-రేవంత్ కు లేఖ..!

తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లా మామునూరులో నిర్మిస్తున్న కొత్త ఎయిర్ పోర్టుకు ఏ పేరు పెట్టాలనే విషయంపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా ప్రతిపాదనలు ఆహ్వానించారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా తన వైపు నుంచి మామునూరు ఎయిర్ పోర్టు కు ఓ కొత్త పేరు సూచించారు. వరంగల్ జిల్లాకు చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, 1857 తిరుగుబాటు సమయంలో హైదరాబాద్‌లో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన ప్రతిఘటనతో అనుబంధం ఉన్న “మౌల్వీ సయ్యద్ […]

బలపడుతున్న వాయుగుండం.. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు!

పశ్చిమమధ్య, వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం కేంద్రీకృతమైంది. గడిచిన 6 గంటల్లో గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ప్రస్తుతానికి గోపాల్‌పూర్ (ఒడిశా)కు 220 కిమీ, పూరీకు 220 కిమీ, కళింగపట్నంకు 230 కిమీ, విశాఖపట్నానికి 320 కిమీ దూరంలో కేంద్రీకృతం అయినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరో 6 గంటల్లో తీవ్రవాయుగుండంగా బలోపేతం అవుతుంది. బుధవారం రాత్రి, గురువారం తెల్లవారుజాము మధ్య విశాఖపట్నం- గోపాల్‌పూర్ మధ్య తీరాలను దాటే అవకాశం ఉందని.. అంచనా వేసింది.

కుప్పం నుంచి 11,359 కోట్ల పనులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు

కుప్పం వేదికగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వివిధ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్ విధానంలో శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఒక్కరోజే రూ. 11,359 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించామని, ప్రస్తుతం జరుగుతున్న పనులతో కలిపి మొత్తం రూ. 50 వేల కోట్ల విలువైన ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే ఏపీ దశ-దిశ పూర్తిగా మారుతుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON