ఫార్మా కంపెనీలు రిటైలర్లకు విక్రయించే మందుల ధరలకు, ప్యాకెట్లపై ముద్రించే MRP కి మధ్య ఉన్న భారీ వ్యత్యాసంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తయారీదారుల నుంచి రిటైలర్లకు కేవలం రూ. 2,700లకే లభించే జీవన రక్షక క్యాన్సర్ వంటి ఔషధాలను, మార్కెట్లో ఏకంగా రూ. 27వేల ఎమ్మార్పీతో విక్రయించడం పట్ల తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ప్రాణాలు కాపాడుకోవడానికి ఇళ్లను, బంగారం అమ్ముకుంటున్నారని జస్టిస్ మెహతా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దోపిడీని అరికట్టడానికి కఠిన నిబంధనలు అమల్లోకి తీసుకురావాలని కోరారు.