నిమ్స్ వైద్యుడు, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నోరి లక్ష్మీభాస్కర్ నివాసం, కార్యాలయాలపై ఏసీబీ (ACB) దాడులు చేపట్టింది. ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో సోదాలు కొనసాగుతున్నాయి. ఎర్రగడ్డలో లక్ష్మీభాస్కర్ కు చెందిన కల్పతరువు అపార్ట్మెంట్స్ సహా ఆయన కుటుంబసభ్యుల నివాసాల్లోనూ సోదాలు జరుగుతున్నాయి. మొత్తం 13 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఏసీబీ అధికారులు బృందాలుగా ఏర్పడి సోదాలు కొనసాగిస్తున్నారు.