loader

పట్టాలపై ప్రియుడితో ఎన్నారై యువతి.. క్షణాల్లో ఘోరం!

న్యూయార్క్ నగరంలో పట్టాలపై కూర్చున్న ఓ జంటను రైలు ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో భారత సంతతికి చెందిన  మలైకా చిత్రే (24)తో పాటు నేపాలీ-అమెరికన్ నవమ్ కౌల్ (24) ఉన్నారు. బలవన్మరణమా? లేదంటే మత్తులో అక్కడికి చేరారా?.. వీళ్లు పట్టాలపై ఎందుకు కూర్చున్నారు అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. లోయర్ మన్హటన్ లోని స్ప్రింగ్ స్ట్రీట్ సబ్వే స్టేషన్లో ఆదివారం తెల్లవారుజామున 3.15 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.

పులివెందులలో అర్దరాత్రి కాల్పుల కలకలం

వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులలో సోమవారం అర్ధరాత్రి కాల్పుల కలకలం రేగింది. వినాయక విగ్రహం వద్ద పుష్పనాథ్ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి వర్గీయుల మధ్య వాగ్వాదం జరిగింది. తనను సన్మానించలేదని పుష్పనాథ్ను విజయ్ నిలదీయడంతో వాగ్వాదం జరిగి ఘర్షణకు దారి తీసింది.  ఈ క్రమంలో హజ్ కమిటీ డైరెక్టర్ బాషా గన్మెన్ గాల్లోకి ఒక రౌండ్ కాల్పులు జరిపారు. విజయ్ ఇంటి వద్ద మూడు వాహనాలను పుష్పనాథ్ వర్గీయులు ధ్వంసం చేశారు.

అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం

 అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం ప్రతి సంవత్సరం సెప్టెంబరు 15న ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. ప్రజల్లో ప్రజాస్వామ్య సూత్రాలను ప్రోత్సహించడం, అవగాహన కలిపించాలన్నా ఉద్దేశ్యంతో ఈ దినోత్సవం జరుపబడుతుంది.

APPSC రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లు విడుదల

ఏపీపీఎస్సీ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్లు విడుదల చేసింది. వెబ్ సైట్లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి. మొత్తం 163 పోస్టులకు గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు అక్టోబర్ 6 నుంచి 27 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. 20 శాఖలకు సంబంధించి పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఐదు శాఖలకు సంబంధించి  పోస్టులకు బుధవారం నోటిఫికేషన్ రానుంది. మరో 10 శాఖల్లో ఉద్యోగాలకు సంబంధించి ఈనెల 24న ప్రకటన విడుదల కానుంది.

విజయవాడలో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం!

 విజయవాడలో నరసరావుపేట నుంచి విజయవాడ వచ్చిన ఓ బస్సులో  ఒక బ్యాగులో ఏకంగా 46 జిలెటిన్ స్టిక్స్, 50 డిటోనేటర్లు లభ్యమవడంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆసిఫ్ అలీ అనే ప్రయాణికుడు బ్యాగ్ బదులు మరొకరి బ్యాగ్ అతడికి వచ్చింది. ఆ బ్యాగ్‌ను తెరిచి చూడగా అందులో భారీగా జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు కనిపించాయి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీల గాలింపు చర్యలు చేపట్టారు

పోలీస్ స్టేషన్లోనే దాడి.. కేటీఆర్ సంచలన ట్వీట్

 తెలంగాణలో శాంతిభద్రతల పరిస్థితిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుంపు దాడులు కేవలం హత్యలతోనే ప్రారంభం కావని, పూర్తి స్థాయిలో పనిచేస్తున్న పోలీస్ స్టేషన్లోనే యూనిఫాం ధరించిన అధికారుల ముందే పథకం ప్రకారం జరిగే దాడులతో కూడా మొదలవుతాయని ఆయన అన్నారు. తన పీఆర్ మహేష్ మణిక్యాల, పీఏ మహేందర్ రెడ్డిలపై పోలీస్ స్టేషన్ లోపలే దాడి జరిగిందని కేటీఆర్ ఆరోపించారు.  తెలంగాణ ప్రస్తుతం అరాచకత్వ అంచున నిలిచిందని, కాంగ్రెస్ పాలనలోనే ఇది సాధ్యమైందని.. రాహుల్ గాంధీని ట్యాగ్ […]

రూ.2,000 వరకు UPI చెల్లింపులపై బ్యాంక్ ఛార్జీలు వేయొద్దు- కేంద్రం స్పష్టం

చిన్న మొత్తాల డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడంతో పాటు వినియోగదారులకు, వ్యాపారులకు ఆర్థిక భార తగ్గించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యుపిఐ (UPI), రూపే (RuPay) డెబిట్ కార్డుల ద్వారా రూ.2,000 వరకు జరిపే పేమెంట్స్‌పై బ్యాంకులు లేదా పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్లు ఎలాంటి ప్రత్యక్ష లేదా పరోక్ష  ఛార్జీలను వసూలు చేయకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.  రూ.2,000 కంటే ఎక్కువ మొత్తంలో చేసే UPI లేదా రూపే లావాదేవీల విషయంలో మాత్రం ప్రభుత్వం ఇంకా పూర్తిస్థాయి […]

తెలంగాణలో నేడు భారీ వర్షాలు

తెలంగాణలో ఈ రోజు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఈ మేరకు 11 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. అలాగే, సెప్టెంబర్ 18, 19వ తేదీల్లో జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON