తెలంగాణలో ఈ రోజు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఈ మేరకు 11 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. అలాగే, సెప్టెంబర్ 18, 19వ తేదీల్లో జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది.