శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు కలియుగ వైకుంఠం తిరుమల సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. సోమవారం రాత్రి స్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణం జరిగింది. శ్రీవారి సేనాధిపతి అయిన విష్వక్సేనుడి పర్యవేక్షణలో ఈ క్రతువును నిర్వహించారు. మంగళవారం సాయంత్రం 6.21 గంటలకు మీనలగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.