చిన్న మొత్తాల డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడంతో పాటు వినియోగదారులకు, వ్యాపారులకు ఆర్థిక భార తగ్గించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యుపిఐ (UPI), రూపే (RuPay) డెబిట్ కార్డుల ద్వారా రూ.2,000 వరకు జరిపే పేమెంట్స్‌పై బ్యాంకులు లేదా పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్లు ఎలాంటి ప్రత్యక్ష లేదా పరోక్ష ఛార్జీలను వసూలు చేయకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. రూ.2,000 కంటే ఎక్కువ మొత్తంలో చేసే UPI లేదా రూపే లావాదేవీల విషయంలో మాత్రం ప్రభుత్వం ఇంకా పూర్తిస్థాయి స్పష్టతనివ్వలేదు.