వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులలో సోమవారం అర్ధరాత్రి కాల్పుల కలకలం రేగింది. వినాయక విగ్రహం వద్ద పుష్పనాథ్ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి వర్గీయుల మధ్య వాగ్వాదం జరిగింది. తనను సన్మానించలేదని పుష్పనాథ్ను విజయ్ నిలదీయడంతో వాగ్వాదం జరిగి ఘర్షణకు దారి తీసింది. ఈ క్రమంలో హజ్ కమిటీ డైరెక్టర్ బాషా గన్మెన్ గాల్లోకి ఒక రౌండ్ కాల్పులు జరిపారు. విజయ్ ఇంటి వద్ద మూడు వాహనాలను
పుష్పనాథ్ వర్గీయులు ధ్వంసం చేశారు.