loader

పోలీసులు దాడి చేసిన తీరును గవర్నర్‌కు వివరించాం : కేటీఆర్

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పోలీసులను అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశామని కేటీఆర్ పేర్కొన్నారు. అసెంబ్లీకి రానివ్వకుండా పోలీసులు దాడి చేసిన తీరును, తెలంగాణలో పరిస్థితులను గవర్నర్‌కు వివరించామన్నారు. శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డిపై పురుష పోలీసుల దాడి వీడియోలను చూపించాం. రైతులు, నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలను తెలిపామన్నారు. ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి చీరను లాగి దుశ్వాసనపర్వం ఎలా సృష్టించారో చెప్పామన్నారు. కేసీఆర్‌ చావు కోరుతూ ఎలా మాట్లాడారో గవర్నర్‌కు చెప్పామన్నారు.

కెసిఆర్ ఆరోగ్యం చెడిపోవాలని హరీష్ క్షుద్రపూజలు! : మహేష్ కుమార్ గౌడ్

బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కు ప్రాణసష్టం ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే చెబుతున్నారని టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఏనాడూ కెసిఆర్ చెడు కోరుకోలేదని స్పష్టం చేశారు. కెసిఆర్ ఆరోగ్యం చెడిపోవాలని హరీష్ రావు క్షుద్రపూజలు చేశారని కవిత చెప్పారని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపణలు చేశారు. కెసిఆర్ ఆరోగ్యం చెడిపోతే హరీష్ రావు రాజకీయంగా లబ్ధి పొందాలని కవిత చెప్పారని గుర్తు చేశారు. కల్వకుంట్ల ఇంటి పంచాయితీని కాంగ్రెస్ […]

తెలంగాణ అక్షరానికి ధిక్కారం నేర్పిన మేరు నగధీరుడు..

ఒక దేశం లేదా ప్రాంతపు చరిత్ర అంటే కేవలం రాజుల విజయాలో, పాలక వర్గాల అధికార మార్పిడులో మాత్రమే కాదు. ప్రజల వైపు నిలబడి, అణచివేతపై కలం ఎత్తిన విప్లవ మూర్తుల జీవిత సారాంశమే నిజమైన చరిత్ర. ఆ కోవలోనే తెలంగాణ పోరాట చరిత్రలో కాళోజీ పేరు ఒక చెరగని సంతకం. మూడు తరాల ప్రజా ఉద్యమాలకు వాయిస్‌గా నిలిచి, అధికారాన్ని ధిక్కరించిన నిప్పుకణం ఆయన. నేడు ప్రజాకవి, కాళోజీ జయంతి సందర్భంగా ఆ విప్లవ సేనాని […]

ఢిల్లీ ప్ర‌భుత్వ మాజీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రాకేశ్ మెహ‌తా ఆత్మ‌హ‌త్య‌..!

ఢిల్లీ ప్ర‌భుత్వ‌ మాజీ చీఫ్ సెక్రటరీ, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాకేశ్ మెహతా తీవ్ర విషాదకర రీతిలో ప్రాణాలు తీసుకున్నారు. నోయిడాలో తన ఫ్లాట్‌లో ఆయన ఉరివేసుకున్నారు. సూసైడ్ నోట్‌లో తాను గత కొంతకాలంగా ఎదుర్కొంటున్న తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, మానసిక ఆందోళనల కారణంగానే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు 2007 నుంచి మూడేళ్లకుపైగా ఢిల్లీ ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. 2010లో ఢిల్లీ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణలోను, ఢిల్లీ రవాణా, విద్యుత్ విప్లవాత్మక మార్పుల్లో […]

ఆ నెల నుంచే పాదయాత్ర 2.O స్టార్ట్.. వైసీపీ అధినేత జగన్ కీలక ప్రకటన!

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది నుంచి పాదయాత్ర చేయబోతున్నట్టు తెలిపారు. 2027 సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో పాదయాత్ర స్టార్ట్ చేస్తానని జగన్ ప్రకటించారు. బుధవారం పర్చూరు నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో జగన్ ఈ ప్రకటన చేశారు. ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లి.. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ఈ యాత్ర సాగనుందని చెప్పినట్లు తెలుస్తోంది. 2029లో ఏపీలో తిరిగి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

మార్చి నాటికి భూ సమస్యలు పరిష్కరిస్తాం : చంద్రబాబు

వచ్చే మార్చి నాటికి భూ సమస్యలన్నీ పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. బుధవారం కోనసీమ జిల్లా మాచవరంలో జరిగిన మీ భూమి- మీహక్కు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రజల జీవితాలు మెరుగుపరిచేందుకే సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని తెలిపారు. గతంలో రెవెన్యూశాఖలో డబ్బు ఇస్తేనే గాని పని జరిగేదన్న అపవాదు ఉండేది. దాన్ని మార్చి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేశామన్నారు.

‘సిగ్మా’ ఈవెంట్‌లో.. ‘టీవీకే.. టీవీకే’ నినాదాలతో హోరెత్తిన వేదిక!

సీఎం విజయ్ తనయుడు జేసన్ సంజయ్ తన మొట్టమొదటి దర్శకత్వ ప్రాజెక్ట్ అయిన ‘సిగ్మా’ సేలం ఈవెంట్‌లో భారీగా తరలివచ్చిన విజయ్ అభిమానులు ఒక్కసారిగా ‘టీవీకే.. టీవీకే’ అంటూ నినాదాలతో సభా ప్రాంగణాన్ని హోరెత్తించారు. తన తండ్రి విజయ్ స్థాపించిన రాజకీయ పార్టీ పేరుతో అభిమానులు జోరుగా కేకలు వేస్తుండగా, వేదికపై ఉన్న జేసన్ సంజయ్ ఏమాత్రం తికమక పడకుండా ఎంతో ప్రశాంతంగా, చిరునవ్వుతో స్పందించారు. అభిమానులను చూస్తూ థంబ్స్ అప్ చూపించి అభివాదం చేయడంతో అక్కడి […]

మ్యూస్ పర్సనల్ ఏఐ ఏజెంట్ ను ప్రారంభించిన మెటా

మెటా సంస్థ AI ఏజెంట్ మ్యూస్ ను ప్రారంభించింది. ఇది వినియోగదారులకు ప్రయాణాలను బుక్ చేయడంతో పాటు వారి ఇ-మెయిల్లను పంపడం, ఆన్ లైన్లో షాపింగ్ చేయగలగడం వంటివి దీని ప్రత్యేకత. మెటా, దాని అనుసంధానిత యాప్ లలో రోజువారీ డిజిటల్ పనులను నిర్వహించేందుకు దీనిని తీసుకొచ్చింది. ఇది గోప్యత, భద్రతా నియంత్రణలకు ప్రాధాన్యమిస్తూ, చాట్ బాట్లకు అతీతంగా కంపెనీ ప్రయత్నాలను వివరిస్తుంది. ప్రారంభంలో USA లోని వయోజనులకు అందుబాటులో ఉండే మ్యూసు, మెటా వాట్సాప్ ప్లాట్ […]

వందేమాత‌రం ఫుల్ వ‌ర్ష‌న్‌..కాంగ్రెస్‌, NC మ‌ధ్య వివాదం

జ‌మ్మూక‌శ్మీర్‌లో అంత‌ర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ ప్రారంభ‌ స‌మ‌యంలో వందేమాత‌ర పూర్తి గీతాన్ని ప్లే చేశారు. ఎన్సీ నేత‌లు సీఎం ఒమ‌ర్ అబ్దుల్లా, ఫారూక్ అబ్దుల్లా.. ఆ సాంగ్ మొత్తం నిల‌బ‌డి ఉన్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. వందేమాత‌రం గీతం తొలి చ‌ర‌ణం పాడిన‌ప్పుడు మాత్రమే నిల‌బ‌డి ఉంటే స‌రిపోతుంద‌న్న కాంగ్రెస్ వెల్ల‌డించింది. కాంగ్రెస్ పార్టీ వ్య‌క్తం చేసిన అభిప్రాయాల‌ను నేష‌న‌ల్ కాంగ్రెస్ త‌ప్పుప‌ట్టింది. కూట‌మి పార్టీల‌కు కాంగ్రెస్ ఆదేశాలు ఇవ్వ‌డం స‌రికాదు అని […]

ఎస్సిలపై బిఆర్ఎస్ విపక్ష చూపుతోంది: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఫైర్

బుధవారం శాసనసభలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఎస్సిలపై బిఆర్ఎస్ విపక్ష చూపుతోందని తీవ్రంగా మండిపడ్డారు. దళిత సమాజిక వర్గానికి చెందిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై బిఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఎస్సిలు నిరసన కార్యక్రమం చేపట్టారని.. ఎస్సీలు నిరసన తెలిపిన ప్రాంతంలో పసుపు నీళ్లతో బిఆర్ఎస్ నాయకులు శుద్ధి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుద్ధీకరణ పేరుతో బిఆర్ఎస్ చిల్లర రాజకీయం చేసిందని… ఎస్సిలకు బిఆర్ఎస్ క్షమాపణ చెప్పాలని […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON