జమ్మూకశ్మీర్‌లో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభ సమయంలో వందేమాతర పూర్తి గీతాన్ని ప్లే చేశారు. ఎన్సీ నేతలు సీఎం ఒమర్ అబ్దుల్లా, ఫారూక్ అబ్దుల్లా.. ఆ సాంగ్ మొత్తం నిలబడి ఉన్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. వందేమాతరం గీతం తొలి చరణం పాడినప్పుడు మాత్రమే నిలబడి ఉంటే సరిపోతుందన్న కాంగ్రెస్ వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేసిన అభిప్రాయాలను నేషనల్ కాంగ్రెస్ తప్పుపట్టింది. కూటమి పార్టీలకు కాంగ్రెస్ ఆదేశాలు ఇవ్వడం సరికాదు అని ఎన్సీ పేర్కొన్నది.