ఢిల్లీ ప్రభుత్వ మాజీ చీఫ్ సెక్రటరీ, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాకేశ్ మెహతా తీవ్ర విషాదకర రీతిలో ప్రాణాలు తీసుకున్నారు. నోయిడాలో తన ఫ్లాట్‌లో ఆయన ఉరివేసుకున్నారు. సూసైడ్ నోట్‌లో తాను గత కొంతకాలంగా ఎదుర్కొంటున్న తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, మానసిక ఆందోళనల కారణంగానే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు 2007 నుంచి మూడేళ్లకుపైగా ఢిల్లీ ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. 2010లో ఢిల్లీ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణలోను, ఢిల్లీ రవాణా, విద్యుత్ విప్లవాత్మక మార్పుల్లో ఆయన కీలక భూమిక పోషించారు