ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది నుంచి పాదయాత్ర చేయబోతున్నట్టు తెలిపారు. 2027 సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో పాదయాత్ర స్టార్ట్ చేస్తానని జగన్ ప్రకటించారు. బుధవారం పర్చూరు నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో జగన్ ఈ ప్రకటన చేశారు. ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లి.. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ఈ యాత్ర సాగనుందని చెప్పినట్లు తెలుస్తోంది. 2029లో ఏపీలో తిరిగి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.