బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కు ప్రాణసష్టం ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే చెబుతున్నారని టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఏనాడూ కెసిఆర్ చెడు కోరుకోలేదని స్పష్టం చేశారు. కెసిఆర్ ఆరోగ్యం చెడిపోవాలని హరీష్ రావు క్షుద్రపూజలు చేశారని కవిత చెప్పారని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపణలు చేశారు. కెసిఆర్ ఆరోగ్యం చెడిపోతే హరీష్ రావు రాజకీయంగా లబ్ధి పొందాలని కవిత చెప్పారని గుర్తు చేశారు. కల్వకుంట్ల ఇంటి పంచాయితీని కాంగ్రెస్ పార్టీకి ఆపాదించడం సరికాదన్నారు.