loader

మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మితకు పదవి…

మెగాస్టార్ చిరంజీవి కుమార్తె, టాలీవుడ్ నిర్మాత కొణిదెల సుస్మితకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. సుస్మితను విజయవాడ దుర్గమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డుకు ప్రత్యేక ఆహ్వానితురాలుగా నియమించింది. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కార్యదర్శి కన్నబాబు కొణిదెల సుస్మితను దుర్గమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డు ప్రత్యేక ఆహ్వానితురాలుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సుస్మిత విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు..అలాగే ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రత్యేక ఉత్సవాల్లో భాగస్వామ్యమై తగిన సూచనలు, […]

గూండాలతో కేసీఆర్ ఇంటిపై దాడి చేస్తారా?: హరీశ్ రావు

రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా గూండాలను పంపించి దాడి చేయిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ధ్వజమెత్తారు. హకీంపేట వద్ద ఆయన్ను అరెస్ట్ చేసిన మేడ్చల్ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీస్ స్టేషన్లో హరీశ్ రావు మాట్లాడుతూ.. కొంత మంది తప్ప తాగి కేసీఆర్ ఇంటిపై దాడికి వెళ్తుంటే..పోలీసులే ఎస్కార్ట్ ఇవ్వడమేంటన్నారు. హోం మంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డినే ఈ దాడికి ప్రణాళిక రూపొందించారని […]

1980 నుంచి అదృశ్యమైన లాకర్ తాళంపై సీఎం, జడ్జికి ఫిర్యాదు

కోల్‌కతాలోని ప్రసిద్ధ కాళీఘాట్ ఆలయ నిర్వహణ మరియు ఆస్తులపై తీవ్ర కలకలం రేగింది. ఆలయంలోని ఓ అత్యంత కీలకమైన లాకర్ తాళం చెవి గత 1980 నుంచి కనిపించడం లేదని ఆలయ నిర్మాతల వారసుడు దేబర్షి రాయ్ చౌదరి ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రికి, జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. సSBI ఆలయ లాకర్లలోని పురాతన బంగారు ఆభరణాలు, దస్తావేజుల పరిస్థితిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

కేటీఆర్ అరెస్ట్.. హకీంపేటలో భారీ ఆందోళన!

ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్ కు వెళ్తున్న కేటీఆర్, హరీశ్ రావు సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను హకీంపేట వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. మేడ్చల్ మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి అక్కడకు చేరుకుని కేటీఆర్, ఇతర ఎమ్మెల్యేలను మరోసారి అడ్డుకోవడంతో రోడ్డుపైనే బైఠాయించారు. దీంతో కేటీఆర్ సహా అందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసి సమీపంలోని పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. కేటీఆర్ ను బోయినపల్లి, హరీశ్ రావును జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. అరెస్టులకు నిరసనగా హకీంపేటలో పార్టీ శ్రేణులు ఆందోళకు దిగారు.

సామ్‌సంగ్‌లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు బిగ్ షాక్!

సామ్‌సంగ్‌ సంస్థ తన సిబ్బందిని తగ్గించుకునే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా సంస్థకు చెందిన టెలివిజన్, హోమ్ అప్లయన్సెస్ విభాగాల్లో పనిచేస్తున్న దాదాపు 80 నుంచి 100 మంది ఎగ్జిక్యూటివ్ లను రాజీనామా చేయాల్సిందిగా కోరినట్లు సమాచారం.ఈ ఉద్యోగాల కోత ప్రభావం కేవల దిగువ స్థాయి సిబ్బంది పైనే కాకుండా.. ప్రధాన కార్యాలయంలోని డైరెక్టర్ స్థాయి అధికారులు, టీమ్ లీడర్లు, అలాగే రీజినల్, బ్రాంచ్ మేనేజర్లపై కూడా పడింది.

సౌదీ అరేబియాపై హూతీల దాడులు: 73 మంది పౌరులకు గాయాలు

సౌదీ అరేబియాపై యెమెన్‌కు చెందిన, ఇరాన్ మద్దతుగల హూతీ తిరుగుబాటుదారులు జరిపిన దాడుల్లో 73 మంది గాయపడ్డారని రియాద్ నేతృత్వంలోని కూటమి మంగళవారం తెలిపింది, అలాగే ఈ దాడులకు తగిన విధంగా స్పందిస్తామని ప్రకటించింది. “పౌర మరియు ఆర్థిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని హూతీ ఉగ్రవాద మిలీషియా జరిపిన విచక్షణారహిత దాడుల” వల్ల “73 మంది పౌరులు గాయపడ్డారని” కూటమికి చెందినసంయుక్త దళాల కమాండ్ ఒక ప్రకటనలో పేర్కొంది.

కేటీఆర్, హరీశ్‌రావు వాహనాలను అడ్డుకున్న పోలీసులు.. కాలినడకగా

ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసంపై దాడికి కాంగ్రెస్ శ్రేణులు బయల్దేరారు. కేటీఆర్, హరీశ్‌రావు సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నఫళంగా అసెంబ్లీ నుంచి ఎర్రవెల్లికి బయల్దేరారు.ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు.హకీంపేట వద్ద వారి వాహనాలను ఆపి అదుపులోకి తీసుకునేందుకు యత్నిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులతో ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద అగ్రహం వ్యక్తం చేశారు.పోలీసులు తమ వాహనాలను అడ్డుకోవడంతో బొల్లారం చౌరస్తా నుంచి ఎర్రవెల్లివైపు కేటీఆర్, హరీశ్‌రావు, ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు పాదయాత్రగా […]

ఎదురుదురుగా డీ కొన్న కాంగ్రెస్ VS బీఆర్ఎస్

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పట్టణంలో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీల శ్రేణులు పోటాపోటీగా ఆందోళన బాట పట్టడంతో పటాన్‌చెరు జాతీయ రహదారి (NH 65) పరిసరాలు రణరంగంగా మారాయి. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ బీఆర్‌ఎస్ నాయకులు తీవ్రస్థాయిలో నినాదాలు చేయగా.. మరోవైపు గత బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలోని అవినీతి, ప్రజా వంచనను ఎండగడుతూ కాంగ్రెస్ కార్యకర్తలు ఎదురుదాడికి దిగారు.

ఎర్రవల్లిలో తీవ్ర ఉద్రిక్తత.. భారీగా మోహరించిన పోలీసులు

సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద డప్పుల మోతకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలి వచ్చి డప్పులు మోగిస్తూ నిరసన తెలిపేందుకు ప్రయత్నించారు. వరదరాజపూర మీదుగా కేసీఆర్ ఫామ్ హౌస్ సమీపంలోకి కాంగ్రెస్ కార్యకర్తలు దూసుకెళ్లారు. దీంతో పోలీసులు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. కొందరు కార్యకర్తలు బారికేడ్లను తోసుకుని కేసీఆర్ ఫామ్ హౌస్ కు అర కిలోమీటరు దగ్గర్లోకి వెళ్లి […]

మహిళా పోలీసుల ముందే బట్టలు ఎందుకు విప్పాలి? సీతక్క ఆగ్రహం

మంగళవారం శాసనసభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మరియు ఎమ్మెల్సీల తీరుపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అసెంబ్లీ గేట్ల వద్ద మహిళా పోలీసుల సమక్షంలో నిరసనల పేరుతో బట్టలు విప్పుకుని నిరసన తెలపాల్సిన దుస్థితి ఎందుకు వచ్చిందని ఆమె నిలదీశారు సభాపతి స్థానంలో ఉన్న స్పీకర్‌ను బీఆర్ఎస్ సభ్యులు దూషించడాన్ని మంత్రి సీతక్క తీవ్రంగా ఖండించారు. సభా మర్యాదలను మంటగలిపేలా ప్రవర్తించిన సదరు సభ్యులను కఠినంగా శిక్షించాలని సభలో డిమాండ్ చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON