రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా గూండాలను పంపించి దాడి చేయిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ధ్వజమెత్తారు. హకీంపేట వద్ద ఆయన్ను అరెస్ట్ చేసిన మేడ్చల్ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీస్ స్టేషన్లో హరీశ్ రావు మాట్లాడుతూ.. కొంత మంది తప్ప తాగి కేసీఆర్ ఇంటిపై దాడికి వెళ్తుంటే..పోలీసులే ఎస్కార్ట్ ఇవ్వడమేంటన్నారు. హోం మంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డినే ఈ దాడికి ప్రణాళిక రూపొందించారని ఫైర్ అయ్యారు.