సామ్‌సంగ్ సంస్థ తన సిబ్బందిని తగ్గించుకునే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా సంస్థకు చెందిన టెలివిజన్, హోమ్ అప్లయన్సెస్ విభాగాల్లో పనిచేస్తున్న దాదాపు 80 నుంచి 100 మంది ఎగ్జిక్యూటివ్ లను రాజీనామా చేయాల్సిందిగా కోరినట్లు సమాచారం.ఈ ఉద్యోగాల కోత ప్రభావం కేవల దిగువ స్థాయి సిబ్బంది పైనే కాకుండా.. ప్రధాన కార్యాలయంలోని డైరెక్టర్ స్థాయి అధికారులు, టీమ్ లీడర్లు, అలాగే రీజినల్, బ్రాంచ్ మేనేజర్లపై కూడా పడింది.