ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్ కు వెళ్తున్న కేటీఆర్, హరీశ్ రావు సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను హకీంపేట వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. మేడ్చల్ మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి అక్కడకు చేరుకుని కేటీఆర్, ఇతర ఎమ్మెల్యేలను మరోసారి అడ్డుకోవడంతో రోడ్డుపైనే బైఠాయించారు. దీంతో కేటీఆర్ సహా అందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసి సమీపంలోని పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. కేటీఆర్ ను బోయినపల్లి, హరీశ్ రావును జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. అరెస్టులకు నిరసనగా హకీంపేటలో పార్టీ శ్రేణులు ఆందోళకు దిగారు.