loader

ముగిసిన సింధు పోరాటం..

సొంతగడ్డపై జరుగుతున్న ప్రతిష్ఠాత్మక టోర్నీ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ స్టార్ షట్లర్ పి. వి. సింధు పతకం లేకుండానే ముగించింది. మహిళల సింగిల్స్ ఆమె పోరాటం ముగిసింది. గురువారం ఉత్కంఠభరితంగా సాగిన ప్రిక్వార్టర్ ఫైనల్స్లో సింధు 11-21, 21-15, 17-21తో ప్రపంచ నంబర్ 3 వాంగ్ జి యిని (చైనా) చేతిలో ఓటమిపాలైంది. చివర్లో చైనా షట్లర్ గాయంతో ఇబ్బందిపడినా గొప్పగా పోరాడిన తీరు అందర్నీ ఆకట్టుకుంది.

సీబీఎస్‌ఈ స్కూళ్లలో త్రిభాషా విధానంపై సుప్రీంకోర్టు అభ్యంతరం..

సీబీఎస్‌ఈ స్కూళ్లలో త్రిభాషా విధానాన్ని అమలు చేస్తూ గతంలో బోర్డు (కేంద్ర ప్రభుత్వం) నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.అత్యవసరంగా త్రిభాషా విధానం అమలు చేయాల్సిన అవసరం లేదని కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు సీబీఎస్‌సీ బోర్డును, కేంద్రాన్ని ప్రశ్నించింది. త్రిభాషా విధానంపై సమీక్షించాలని సూచించింది. అత్యవసరంగా దీన్ని అమలు చేయాల్సిన అవసరం ఏంటని బోర్డును ప్రశ్నించింది. మరో పది రోజుల్లో ఈ కేసుపై తదుపరి విచారణ జరుపుతామని చెబుతూ కేసును వాయిదా వేసింది.

హాకీ ప్రపంచ కప్: రెండో రౌండ్లో భారత్

హాకీ ప్రపంచ కప్ లో భాగంగా ఇంగ్లాండ్ లో జరిగిన పూల్ డి మ్యాచ్ ను భారత్ 0-0తో డ్రాగా ముగించింది. ఇంగ్లాండ్ క్రీడాకారిణులు గోల్స్ చేయడానికి గట్టిగా ప్రయత్నించినా.. భారత ప్లేయర్ లు పట్టుదల ప్రదర్శించి గోల్స్ రాకుండా అడ్డుకున్నారు. ఈ మ్యాచ్ ను డ్రా చేసుకోవడంతో భారత్ ఐదు పాయింట్లతో రెండో రౌండ్ కు అర్హత సాధించగా.. నాలుగు పాయింట్లతో ఉన్న ఇంగ్లాండ్ ఇంటిముఖం పట్టింది. పూల్ డి నుంచి భారత్ రెండో రౌండ్ […]

ఫిఫా అధ్య‌క్షుడికి ప‌ద‌వీ గండం.. ట్రెండ‌వుతున్న’ఇన్‌ఫాంటినో ఔట్’ హ్యాష్‌ట్యాగ్..!

ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ నుంచి వ్య‌తిరేక‌త ఎదుర్కొంటున్న‌ గియ‌నీ ఇన్‌ఫాంటినో ప‌ద‌వీ త్వ‌ర‌లోనే ఊడేలా ఉంది. వివాదాస్ప‌ద నిర్ణ‌యాల‌తో ఈమ‌ధ్య త‌ర‌చూ అభిమానుల ఆగ్ర‌హం చ‌విచూస్తున్న ఇన్‌ఫాంటినో రాజీనామా చేయాల‌నే డిమాండ్ ఊపందుకుంది. వ‌ర‌ల్డ్‌క‌ప్ లాభాల‌ను ప్రైవేట్ వ్య‌క్తుల‌కు క‌ట్ట‌బెట్టాల‌నే ఫిఫా చీఫ్‌ నిర్ణ‌యంపై భ‌గ్గుమంటున్న ఫ్యాన్స్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత‌డి రాజీనామా కోసం క‌దం తొక్కారు. భ‌విష్య‌త్‌లో నిర్వ‌హించే ఫిఫా వ‌ర‌ల్డ్‌క‌ప్‌ల‌ ద్వారా వ‌చ్చే లాభాల‌ను ప్రైవేట్ పెట్టుబ‌డుదారులకు ఇవ్వాల‌నుకుంటున్న గియానీ ఇన్‌ఫాంటినో ప్ర‌య‌త్నాల‌పై ఆగ్ర‌హావేశాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఎంపీ లింగమనేని కుమారుడిపై కేసు

జనసేన ఏపీ రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు సంజూష్ పై హైదరాబాద్ లోని మాదాపూర్ రోడ్డు ప్రమాదం కేసు నమోదయింది. ఈ నెల 16న కారుతో యువతిని సంజూష్ ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఘటనాస్థలిలోనే సదరు యువతి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఎంపీ లింగమనేని కుమారుడు సంజూష్ కారు నడిపినట్లు నిర్ధారించారు. ఈ మేరకు సంజూష్ పై పోలీసులు BNS 106(1) సెక్షన్ కింద […]

వైకాపా నేత సజ్జలపై సంగం డెయిరీ పరువు నష్టం దావా

వైకాపా నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై సంగం డెయిరీ పరువు నష్టం దావా వేసింది. పాల సేకరణ చేయకుండా తితిదేకు నెయ్యి సరఫరా చేస్తున్నట్లు సజ్జల ఆరోపించారు. వాస్తవాలు కప్పిపుచ్చి తప్పుడు ఆరోపణలు చేశారని సంగం డెయిరీ పేర్కొంది. చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో ఆవుపాలు సేకరిస్తున్నట్లు తెలిపింది. సాక్షి టీవీతో పాటు పలు సోషల్ మీడియా అకౌంట్స్ పై దావా చేసింది.

స్థానిక ఎన్నికల్లో జనసైనికుల ఆత్మగౌరవం నిలబెడతాం.. పవన్ కళ్యాణ్

జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లోకల్ బాడీ ఎన్నికలపై దృష్టిపెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసైనికుల పోరాట స్ఫూర్తిని కొనసాగించేలా, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా ముందుకెళ్తామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల్లో జనసైనికుల ఆత్మగౌరవం నిలబెట్టేలా ముందుకెళ్తామంటే.. సార్వత్రిక ఎన్నికల మాదిరిగా కాకుండా స్థానిక ఎన్నికల్లో ఎక్కువ చోట్ల పోటీ చేసేలా జనసైనికులకు పవన్ కళ్యా్ణ్ అవకాశాలు కల్పిస్తారా అనే విశ్లేషణలు మొదలయ్యాయి. తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన జనసైనికుల ఆత్మగౌరవం […]

శ్రీనివాస్ రెడ్డి ఆస్తులు రూ.100 కోట్ల పైమాటే!

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయంలో అడ్మిన్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో ఏసీబీ చేపట్టిన సోదాల్లో భారీగా ఆస్తులు బహిర్గతమయ్యాయి. కిలోకు పైగా బంగారం, 8 ప్లాట్లు, యాచారంలో 10 ఎకరాల భూమి, హస్తినాపురంలో మూడంతస్తుల భవనం, 7 బ్యాంకు ఖాతాల్లో రూ.8 లక్షలు, ఇంట్లో రూ.4 లక్షలు, 3 కార్లు, 3 ద్విచక్ర వాహనాలు గుర్తించారు. బహిరంగ మార్కెట్ వీటి విలువ రూ.100 కోట్ల పైగానే ఉంటుందని అంచనా.

మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌పై కేసు..

తెలంగాణ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అటెంప్ట్ మర్డర్ కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో గొంగడి హరికృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. తనపై సుమంత్‌తో పాటు మరో ఐదుగురు ఇనుప రాడ్లతో దాడి చేసినట్లు హరికృష్ణ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా సుమంత్ సహా మొత్తం ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సుమంత్‌పై బీఎన్‌ఎస్ సెక్షన్ 109 […]

ఝార్ఖండ్ నియామక పరీక్షల రద్దు – ప్రభుత్వం నిర్ణయంపై హైకోర్టు స్టే

ఝార్ఖండ్ రాష్ట్రంలో జరుగుతున్న నియామక పరీక్షల రద్దు వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 11, 13వ జేపీఎస్‌సీ పరీక్షలు మరియు ఇతర నియామకాలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఈ నిర్ణయాన్ని కొత్తగా నియమితులైన ఉద్యోగులు న్యాయస్థానంలో సవాల్ చేశారు. ఈ నేపథ్యంలో, ఝార్ఖండ్ హైకోర్టు ఈ ప్రభుత్వ నిర్ణయంపై స్టే విధిస్తూ తీర్పు ఇచ్చింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON