హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తన మాజీ ప్రియుడి వల్ల తాను చాలా కోల్పోయానని… వాఖ్యలపై అదితి శర్మ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘అనుపమ ఇంటర్వ్యూ చూశా. ఆమె కామెంట్స్‌పై ఒక్కొక్కరికీ ఒక్కో అభిప్రాయం ఉండొచ్చు. కానీ, ఆమె ఎదుర్కొన్న ఇబ్బందిని ధైర్యంగా పంచుకున్నందుకు హ్యాట్సాఫ్ చెప్పాలి. ఆమె మాటల్లో నిజాయితీ ఉంది. ఎవరినీ నిందించడం అనుపమ ఉద్దేశం కాదు. ఆమె పంచుకున్న అనుభవం అవగాహన కలిగించేలా ఉంది. అనుపమలా ఓపెన్‌గా మాట్లాడడం వల్ల అలాంటి వారికి ఓ స్పష్టత వస్తుంది.’ అని తెలిపారు.