క్యాన్సర్ చికిత్సలో కొత్త ఆశలు కలిగించే పరిణామం చోటుచేసుకుంది. మోడెర్నా, మెర్క్ సంస్థలు కలిసి తయారు చేస్తున్న వ్యక్తిగతీకరించిన ఎంఆర్‌ఎన్‌ఏ క్యాన్సర్ వ్యాక్సిన్‌పై నిర్వహించిన కీలక దశ క్లినికల్ ట్రయల్‌లో మంచి ఫలితాలు వచ్చినట్లు ప్రకటించాయి. ముఖ్యంగా ప్రమాదకరమైన మెలనోమా అనే చర్మ క్యాన్సర్ తగ్గించడంలో ఈ చికిత్స ఉపయోగపడే అవకాశాలు కనిపించాయి. ఎంఆర్‌ఎన్‌ఏ క్యాన్సర్ వ్యాక్సిన్ ప్రతి రోగి క్యాన్సర్‌కు అనుగుణంగా, రోగి నుంచి తొలగించిన ట్యూమర్‌ను పరిశీలించి, అందులోని జన్యు మార్పులను గుర్తిస్తారు. వాటిని ఆధారంగా చేసుకుని వ్యాక్సిన్‌ను రూపొందిస్తారు.