ఆంధ్రప్రదేశ్‌లో జూనియర్ డాక్టర్ల (JUDA) ఆందోళనలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ జూనియర్ వైద్యులు చేపట్టిన నిరసనలు, సమ్మె గురువారం నాటికి 11వ రోజుకు చేరుకున్నాయి. ప్రభుత్వం ఇటీవల ప్రతిపాదించిన స్టైపెండ్ పెంపును జూడాల సంఘం ముక్తకంఠంతో తిరస్కరించింది. తమ సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యే వరకు సమ్మె యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు.