గత కొంతకాలంగా ఈ జంటల ఇళ్లలో, కుటుంబ జీవితంలో ఊహించని కష్టాలు, ఆర్థికపరమైన ఇబ్బందులు వరుసగా ఎదురవుతూ వస్తున్నాయి. గతంలో వీరు వివాహం చేసుకున్న ముహూర్తాల్లో ఉన్న తీవ్రమైన గ్రహ దోషాలే కారణం అని మళ్లీ పెళ్లి చేసుకుంటే మంచి జరుగుతుందని ప్రముఖ జ్యోతిష్యుడు ఆనందపురం నారాయణమూర్తి సూచించారు. మొత్తం తొమ్మిది జంటలు..సత్యదేవుని సన్నిధిలో వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ భార్య మెడలో భర్త మరోసారి పసుపుతాడుతో మంగళసూత్రం కట్టి దంపతులుగా సరికొత్తగా ప్రమాణాలు స్వీకరించారు.