వరలక్ష్మీ వ్రతం సందర్భంగా రేపు (శుక్రవారం) ఏపీలో ప్రభుత్వ సెలవు ప్రకటించారు. ఈ సారి వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు చేసుకోవాలనే చర్చ జరిగింది. 21వ తేదీ, 28 తేదీల్లో ఏ రోజు జరుపుకోవాలో సందేహాలు వ్యక్తం అయ్యాయి. దీంతో, పండితులు 21వ తేదీనే జరుపుకోవాలని స్పష్టత ఇచ్చారు. దీంతో, ప్రభుత్వం ఈ మేరకు రేపు (శుక్రవారం) సెలవు ప్రకటించింది. తెలంగాణలో మాత్రం ఆప్షనల్ హాలిడేగా ప్రకటించారు.