కారు అదుపుతప్పి బావిలో దూసుకెళ్లడంతో ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో జరిగింది.దండుగుల రాజు(30), భాగ్య(25) ,కుమారుడు నిహాన్ష్(04), కూతురు శాన్విక(02) బుధవారం రాత్రి సొంతూరు నుంచి కారులో సిద్దిపేటకు వెళ్తుండగా దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామ శివారులో బావిలోకి కారు దూసుకెళ్లడంతో నలుగురు చనిపోయారు. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బావిలోని మృతదేహాలను బయటకు తీశారు