మహాత్మా గాంధీ ముని మనవడు తుషార్ గాంధీ కాక్రోచ్ జనతా వ్యవస్థాపకుడు అభిజిత్ డిప్కే ను కలిశారు. తుషార్ గాంధీకి తన నివాసంలో ఆతిథ్యం ఇవ్వడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు అభిజిత్ తెలిపారు. దేశంలో జెన్ జీ కేవలం ఉద్యమాలకు పరిమితం కాకుండా మహాత్మా గాంధీ నిజమైన విలువలను, ఆదర్శాలను ఆచరణలో పాటిస్తున్నారని తుషార్ గాంధీ కొనియాడారు గాంధీ కుటుంబం నుంచి మద్దతు లభించడం తమ ఉద్యమం అహింసా మార్గంలో శాంతియుతంగా, సాగిందనేదానికి నిదర్శనమని అభిజీత్ డిప్కే తెలిపారు.