హైదరాబాద్ లోని నాంపల్లిలో ఉన్న ఇంటర్ బోర్డు కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు 1 సోదాలు చేపట్టారు. నాలుగు గంటలుగా విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగం తనిఖీలు చేపట్టింది. మాజీ కార్యదర్శి అశోక్ను అధికారులు విచారిస్తున్నారు. 2019 ఇంటర్ ఫలితాల విషయంలో గ్లోబరేనా సంస్థ అవకతవకలకు పాల్పడ్డట్లు ఆరోపణలు వచ్చాయి. మార్కుల్లో తప్పులు
దొర్లడంతో పలువురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగింది.