ఢిల్లీ టిక్రి కలాన్ ప్రాంతంలో ఘోర ప్రమాదం జరిగింది. ఒక సీఎన్జీ పంపులో పేలుడు కారణంగా ఒకరు మరణించగా, మరో ఐదుగురు గాయపడ్డారు. మధ్యాహ్నం ఒక ట్రక్కులో సీఎన్జీ (కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్) నింపుతుండగా.. ట్రక్కు గ్యాస్ ట్యాంక్ ఉన్నట్లుండి పేలిపోయింది. ఈ ఘటనలో పక్కనే ఉన్న ఒక వ్యక్తి మరణించాడు. మరో ఐదుగురు గాయపడ్డారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్తితికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.