ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యుల భాగోతాలు, స్కాములను బయటపెడతానంటూ మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సీఎం ప్రతిష్ఠను మంటగలిపేలా, పార్టీ నియమాలకు విరుద్ధంగా వ్యవహరించిన సుస్మిత వ్యాఖ్యలపై పూర్తి సమాచారం సేకరిస్తున్నామని పార్టీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవి తెలిపారు. పార్టీలో ఎవరైనా లక్ష్మణరేఖ దాటి ప్రవర్తిస్తే కఠినమైన క్రమశిక్షణా చర్యలు ఖాయమని ఆయన గట్టిగా హెచ్చరించారు.