టీఎంసీ పార్టీ ఎంపీ మహువా మొయిత్రాకు పశ్చిమ బెంగాల్‌లోని కోర్టు షాకిచ్చింది. విద్వేష ప్రసంగంపై దాఖలైన కేసులో అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. సమన్లు జారీ చేసినప్పటికీ హాజరుకాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు బుధవారం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణానగర్ జిల్లా కోర్టు ఈ ఆదేశాలిచ్చింది. తులసి మాలలపై మత విశ్వాసాలు దెబ్బతీసేలా మహువా మొయిత్రా వ్యాఖ్యలు చేశారంటూ ఆమెపై కేసు నమోదైంది.