ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన భాషను మార్చుకోవాలని, నోటిని అదుపులో పెట్టుకోవాలని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. హాస్పిటల్ ప్రారంభోత్సవ సభలో అధికారిక కార్యక్రమం అనే సోయి లేకుండా వైద్యులు, నర్సింగ్ విద్యార్థుల ముందు ముఖ్యమంత్రి నోటికొచ్చినట్లు పచ్చి అబద్దాలు మాట్లాడారని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులకు రేవంత్ రెడ్డి రిబ్బన్ కటింగ్ లు చేస్తున్నారని ఆరోపించారు. సనత్ నగర్ టిమ్స్‌ను కట్టామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకోవడం అవివేకమని విమర్శించారు.