loader

పసుపు రంగు చీరలో పవన్ సతీమణి…ఇండిపెండెన్స్ వేడుకల్లో అన్నా కొణిదెల

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడలో ఇండిపెండెన్స్ డే వేడుకల్లో పాల్గొన్నారు. ఆయనతో పాటు సతీమణి అన్నా కొణిదెల కూడా ఉన్నారు. భారత్ మాతాకి జై అంటూ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఫోటోలు షేర్ చేసిన పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కొణిదెల పసుపు రంగు చీరలో అన్నా కొణిదెల కనిపించడం విశేషం. కాకినాడలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో అన్నా కొణిదెల ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

18 గంటలు.. అంబానీ కంటే గొప్ప అవ్వాలనా..కేటీఆర్ సెటైర్లు

తెలంగాణ భవన్‌లో నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో కేటీఆర్ మాట్లాడుతూ.. కల్యాణలక్ష్మీ కింద తులం బంగారం ఇస్తామని ఎన్నికల ముందు చెప్పారని గుర్తుచేశారు. కానీ ఇవాళ ఉన్న కల్యాణ లక్ష్మీని కూడా ఊడగొట్టిండు అని మండిపడ్డారు. 18 గంటలు పనిచేస్తున్నానని రేవంత్ రెడ్డి గొప్పలు చెబుతున్నాడని కేటీఆర్ అన్నారు. తమ్ముళ్లకు భూములు ఎట్లా దోచిపెట్టాలని పనిచేస్తున్నావా అని ప్రశ్నించారు. అంబానీ కన్నా గొప్పగా నీకుటుంబాన్ని తయారుచేసుకుంటావా అని అడిగారు. రైతులకు యూరియా ఇచ్చే పరిస్థితి లేదని అన్నారు. యూరియా […]

త్వరలోనే హోర్ముజ్ జలసంధిని అమెరికా భూభాగంగా ప్రకటిస్తా : ట్రంప్

త్వరలోనే ఇరాన్‌ను ఓడించిన తర్వాత హోర్ముజ్ జలసంధిని అమెరికా భూభాగంలో భాగంగా “త్వరలోనే” ప్రకటిస్తానని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం అన్నారు. “ఇరాన్‌ను మనం ఓడించడం పూర్తి చేశాం, ఇప్పుడు ఆ దేశం చాలా ఘోరంగా ఓడిపోతోంది — ఆ తర్వాత చాలా త్వరలోనే నేను హోర్ముజ్ జలసంధిని యునైటెడ్ స్టేట్స్ భూభాగంగా ప్రకటిస్తాను,” అని న్యూయార్క్ రాష్ట్రంలోని ఒక పోలీస్ అకాడమీలో జరిగిన రాజకీయ ర్యాలీలో ఆయన నవ్వుతూ అన్నారు. “ఇది నిజం,” అని ఆయన […]

రైతులకు సాగునీరు, గృహాలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌లోని చారిత్రాత్మక గోల్కొండ కోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ముఖ్యమంత్రి, రాష్ట్ర అభివృద్ధి మరియు సంక్షేమంపై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను స్పష్టం చేశారు. రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని, వ్యవసాయాన్ని పండగ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని సీఎం తెలిపారు. రాష్ట్రంలోని గృహ వినియోగదారులతో పాటు వ్యవసాయ రంగానికి నిరంతరాయంగా ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నామని పునరుద్ఘాటించారు.

ఆనం రామనారాయణ రెడ్డికి అస్వస్థత

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా తిరుపతి పోలీస్ పరేడ్ గ్రౌండ్లో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సభను ఉద్దేశించి దాదాపు గంటసేపు ప్రసంగిస్తుండగా మంత్రి బీపీ ఒక్కసారిగా పడిపోవడంతో అస్వస్థతకు గురయ్యారు. తలతిరిగి పడిపోతుండగా వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది మరియు వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు.

అదే మన లక్ష్యం – చంద్రబాబు కీలక పిలుపు…!!

అమరావతిలో తొలి సారిగా జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు జాతీయ జెండా ఆవిష్కరించారు. తన ప్రసంగంలో కీలక అంశాలను ప్రస్తావించారు. హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఏపీ లక్ష్యంగా 10 సూత్రాలను రూపొందించామని చెప్పారు. చేతిలో జాతీయ జెండాతో పాటు గుండెల్లో బలమైన అజెండా ఉండాలని చెప్పారు. వచ్చే 20 ఏళ్ల పాటు నిరంతరం పనిచేసి నిర్దేశించుకు న్న లక్ష్యాలను సాధించేందుకు సంకల్పం తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ తమ రంగంలో బాధ్యతగా పనిచేయడమే ‘అనే […]

స్వాతంత్ర్య వేడుకల్లో.. టీమ్‌ఇండియా ఆటగాళ్లు

టీమిండియా శ్రీలంకలో పర్యటిస్తోంది. గాలె వేదికగా తొలి టెస్టు నేడు ప్రారంభమైంది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని మ్యాచ్కు ముందు తాము బస చేసిన హోటల్ వద్ద భారత జట్టు త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసింది. ఈ కార్యక్రమంలో ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శుభ్ర్మన్ గిల్ ఇతర ఆటగాళ్లు పాల్గొన్నారు. స్వాతంత్ర్య సమరయోధులకు గంభీర్ నివాళులు అర్పించారు. స్వాంతంత్ర్య దినోత్సవం రోజున దేశం తరపున ఆడుతున్న జట్టుకు నాయకత్వం వహించడం గర్వంగా ఉందని శుభ్మన్ గిల్ సంతోషం […]

ఇండిపెండెన్స్ డే వేడుకల్లో త్రిష.. వీడియో వైరల్‌

స్వాతంత్ర్య దినోత్సవ వీక్షకుల గ్యాలరీలో ముందు వరుసలో కూర్చొన్న సీఎం విజయ్ తల్లిదండ్రులు ఎస్ ఏ చంద్రశేఖర్, శోభ చంద్రశేఖర్ ల పక్కనే నటి త్రిష కూర్చోవడం చర్చనీయాంశంగా మారింది. త్రిషను చూసిన అభిమానులు కేరింతలు కొడుతూ చేతులు ఊపారు. అక్కడి అధికారులను త్రిష నవ్వుతూ పలకరించారు. తమిళనాడు సీఎం విజయ్ తల్లిదండ్రులతో ఆమె కనిపించారు. విజయ్ పేరెంట్స్ ను ఆప్యాయంగా పలకరించారు. అలా కొద్దిసేపు మాట్లాడుకున్నారు. త్రిష, విజయ్‌ తల్లిదండ్రులతో కలిసి ఉన్న దృశ్యాలు ప్రస్తుతం […]

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు

భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచి టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా టెస్టు చరిత్రలో 600వ టెస్టు కావడం గమనార్హం. ముగ్గురు స్పినర్లు, ఇద్దరు వికెట్ కీపర్లతో భారత జట్టు బరిలోకి దిగింది. సర్ఫరాజ్ ఖాన్‌కు ఫైనల్ జట్టులో అవకాశం ఇవ్వలేదు. ధ్రువ్ జురెల్ బదులు సర్ఫరాజ్ ఖాన్ జట్టులోకి తీసుకొని ఉంటే బాగుండేదని క్రికెట్ పండితులు సలహాలు ఇస్తున్నారు.

జెండా ఎగురవేసిన సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణలోని గోల్కోండ కోటపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయజెండాను ఆవిష్కరించి వందనం చేశారు. ముందుగా సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో సైనిక స్మారకం వద్దకు వెళ్లిన సీఎం యుద్ధవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం గోల్కొండ కోటకు చేరుకొని జాతీయజెండాను ఎగురవేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON