తెలంగాణ భవన్‌లో నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో కేటీఆర్ మాట్లాడుతూ.. కల్యాణలక్ష్మీ కింద తులం బంగారం ఇస్తామని ఎన్నికల ముందు చెప్పారని గుర్తుచేశారు. కానీ ఇవాళ ఉన్న కల్యాణ లక్ష్మీని కూడా ఊడగొట్టిండు అని మండిపడ్డారు. 18 గంటలు పనిచేస్తున్నానని రేవంత్ రెడ్డి గొప్పలు చెబుతున్నాడని కేటీఆర్ అన్నారు. తమ్ముళ్లకు భూములు ఎట్లా దోచిపెట్టాలని పనిచేస్తున్నావా అని ప్రశ్నించారు. అంబానీ కన్నా గొప్పగా నీకుటుంబాన్ని తయారుచేసుకుంటావా అని అడిగారు. రైతులకు యూరియా ఇచ్చే పరిస్థితి లేదని అన్నారు. యూరియా కావాలంటే లైన్‌లో నిలబడే పరిస్థితి వచ్చిందన్నారు.