అమరావతిలో తొలి సారిగా జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు జాతీయ జెండా ఆవిష్కరించారు. తన ప్రసంగంలో కీలక అంశాలను ప్రస్తావించారు. హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఏపీ లక్ష్యంగా 10 సూత్రాలను రూపొందించామని చెప్పారు. చేతిలో జాతీయ జెండాతో పాటు గుండెల్లో బలమైన అజెండా ఉండాలని చెప్పారు. వచ్చే 20 ఏళ్ల పాటు నిరంతరం పనిచేసి నిర్దేశించుకు న్న లక్ష్యాలను సాధించేందుకు సంకల్పం తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ తమ రంగంలో బాధ్యతగా పనిచేయడమే ‘అనే నేను..’ సంకల్పానికి అర్థమన్నారు.