తెలంగాణలోని గోల్కోండ కోటపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయజెండాను ఆవిష్కరించి వందనం చేశారు. ముందుగా సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో సైనిక స్మారకం వద్దకు వెళ్లిన సీఎం యుద్ధవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం గోల్కొండ కోటకు చేరుకొని జాతీయజెండాను ఎగురవేశారు.