ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. తూర్పు ఇండోనేషియాలోని ఫ్లోరెస్ దీవి సమీపంలో శనివారం తెల్లవారుజామున 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం తీవ్ర భయాందోళనకు గురిచేసింది. భూకంపం ధాటికి పలు భవనాలు దెబ్బతినగా.. ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు ప్రాథమికంగా వెల్లడించారు. బలమైన ప్రకంపనల నేపథ్యంలో కొద్దిసేపు సునామీ హెచ్చరిక జారీ చేయడంతో వందలాది మంది ప్రజలు ఎత్తైన ప్రాంతాలకు పరుగులు తీశారు. ఎండె నగరానికి వాయువ్యంగా సుమారు 68 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు.