దేశ రాజధాని ఢిల్లీలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. చారిత్రకమై ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసి స్వాతంత్ర సమరయోధులను స్మరించుకున్నారు ప్రధాని మోదీ. వరుసగా 13వ సారి జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రధాని మోదీ రికార్డ్ క్రియేట్ చేశారు. దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకున్నారు.భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశమని, 140 కోట్ల మంది సంకల్పాన్ని అడ్డుకోవడం ఎవరికీ సాధ్యం కాదన్నారు.