శ్రీకాళహస్తిలో పట్టపగలే రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్.. కానిస్టేబుల్‌పై దాడి
ఏపీలో గత కొద్దిరోజులుగా అల్లరి మూకలు, గంజాయి బ్యాచ్లు రెచ్చిపోతున్నాయి.ధ్యాత్మిక క్షేత్రమైన శ్రీకాళహస్తిలో గంజాయి అమ్ముతున్నారనే సమాచారంతో వన్ టౌన్ కానిస్టేబుల్ పట్టుకునే ప్రయత్నం చేశారు. దీంతో గంజాయి బ్యాచ్ కానిస్టేబుల్ పైనే దాడి చేయడంతోపాటు, కత్తులతో బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ చర్యతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి రావడంతో చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై ఏపీ ప్రజలు మండిపడుతున్నారు.

