కొత్తగూడెం సుజాతనగర్ మండలం కొత్త అంజినాపురంలో నర్రా అజయ్ పంట పొలంలో 20 మంది కూలీలు పనులు చేసే క్రమంలో పొలం యజమాని మొక్కలకు పురుగుమందు స్ప్రే చేశాడు. స్ప్రే చేసిన సమయంలో కలుపు తీస్తుండగా వారికి పురుగుమందు స్ప్రే కండ్లు, ముక్కుల్లో పడడతో ఆ వాసనకు వారు అస్వస్థకు గురయ్యారు. వాంతులు, విరోచనాలు కావడంతో గమనించిన కుటుంబ సభ్యులు వారిని కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి బుధవారం తీసుకువచ్చారు. ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రి వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.