నేతాజీ సుభాష్ చంద్రబోస్ వారసత్వం రాజకీయ వేదికపైకి రాబోతున్నది. బోస్ మునిమనవడు చంద్రకుమార్ బోస్ కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ‘ఆజాద్ హింద్ పార్టీ’ పేరుతో కొత్త రాజకీయ వేదికను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. యువతను ప్రధాన బలంగా చేసుకుని నేతాజీ అనుసరించిన సమ్మిళిత, లౌకిక భావజాలంతో ముందుకు సాగుతామని చెప్పారు. 2026 ఏప్రిల్లో పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఎంసీలో చేరారు. అయితే నాలుగు నెలలకే ఆ పార్టీకి రాజీనామా చేశారు.