దేశ రాజకీయాల్లో మళ్లీ ‘ఉత్తరాది వర్సెస్ దక్షిణాది’ సెగలు తీవ్రస్థాయికి చేరాయి. నియోజకవర్గాల విభజనకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానంపై మాట్లాడిన మంత్రి ఆధవ్ అర్జున్, ఇది కాంగ్రెస్, బీజేపీల మధ్య రాజకీయ పోరు కాదని, తమిళనాడు రాష్ట్ర స్వయంప్రతిపత్తిని కాపాడుకునే హక్కుల పోరాటమని స్పష్టం చేశారు.గతంలో మూపనార్ వంటి నాయకులకు ప్రధాని అయ్యే అవకాశం వచ్చిందని గుర్తుచేస్తూ, భవిష్యత్తులో దక్షిణాది నుంచి, ముఖ్యంగా తమిళనాడు నేల నుంచే దేశ ప్రధాని రావాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు.