సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి పెంచే అంశంపై కోదండరాంను అడ్డుకున్న నిరుద్యోగులు అడ్డుకున్నారు. మీరు చెప్తేనే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశాము, ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదు? అని నిలదీశారు. మీ మాటలు నమ్మి మేము కాంగ్రెస్ పార్టీని గెలిపించాము. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని పట్టించుకోకపోతే ఎందుకు మౌనంగా ఉన్నారు? మీడియా కూడా మా సమస్యలను కవర్ చేయడం లేదన్నారు. దీంతో నిరుద్యోగులకు సమాధానం చెప్పలేక కోదండరాం వెనుదిరిగారు.