దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరం వర్షాలకు అల్లాడిపోతుంది. జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా మారిపోయింది. ముంబైలోని కుర్లా ప్రాంతంలో కొండ చరియలు విరిగిపడి ఆరుగురు చనిపోయారు. మరో ఐదుగురు శిథిలాల కింద చిక్కుకుని తీవ్రంగా గాయపడ్డారు. ఘట్కోపర్లోని చిరాగ్ నగర్లోని గౌషియా చాల్ వద్ద ఈ కొండచరియ విపత్తు సంభవించింది. వెంటనే అధికారులు అక్కడకు చేరుకుని సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.శిథిలాల కింద ప్రాణాల ఆనవాళ్లను గుర్తించేందుకు ప్రత్యేక బాధితులను గుర్తించే కెమెరాలను ఉపయోగిస్తూ, విస్తృతమైన గాలింపు చర్యలను చేపట్టారు.