loader

వెదర్ రిపోర్టు.. ఆగస్టు, సెప్టెంబర్‌లో తగ్గనున్న వర్షాలు!

నైరుతి రుతుపవనాల ద్వితీయ భాగం(ఆగస్టు, సెప్టెంబర్)లో దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) తాజాగా విడుదల చేసిన ముందస్తు అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ మేరకు ద్వితీయార్ధానికి చెందిన వాతావరణ నివేదికను శనివారం భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా వాయువ్య, మధ్య, తూర్పు భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురిసే పరిస్థితులు కనిపిస్తున్నాయని అంచనాలు చెబుతున్నాయి.

సాక్షి చౌదరి, ప్రియా ఘంఘాస్‌లకు స్వర్ణ పతకాలు

కామన్వెల్త్ క్రీడల్లో భారత్కు మరో రెండు స్వర్ణ పతకాలు వచ్చాయి. మహిళల 51 కేజీల విభాగంలో సాక్షి చౌదరి స్వర్ణం గెలుచుకుంది. ఫైనల్లో రూబీ వైట్(ఇంగ్లాండ్)ను ఓడించి విజేతగా నిలిచింది. ఆ తర్వాత మహిళల 60 కేజీల విభాగంలో ప్రియా ఘంఘాస్ కూడా బంగారు పతకం సాధింంచింది. ఫైనల్లో కెనడాకు చెందిన మేరీ అల్-అహ్మదీహ్ 4-1తో తేడాతో మట్టికరిపించి స్వర్ణం ఎగరేసుకుపోయింది. ఇప్పటివరకు బాక్సింగ్ భారత్ నాలుగు స్వర్ణ పతకాలు సాధించింది. బాక్సింగ్ ఒక ఎడిషన్లో ఇన్ని […]

గ్రూప్స్ నోటిఫికేషన్ రావట్లేదని యువకుడి ఆత్మహత్యాయత్నం..

భగీరథ ప్లాంట్‌లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న వేణు కుమార్ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ముదిగొండ మండలంలో కలకలం రేపింది. సాయంత్రం సమయంలో నిరుద్యోగుల వాట్సాప్‌ గ్రూప్‌లో సూసైట్ నోట్ పోస్ట్ చేసి అతడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గత 5 సంవత్సరాలుగా గ్రూప్స్‌కు ప్రిపేర్ అవుతున్నా. ఒక్కసారి మాత్రమే గ్రూప్స్ రాశా. గ్రూప్ నోటిఫికేషన్ ఇవ్వడంలేదని మనస్తాపానికి గురై తను ఆత్మహత్యాయత్నం చేశానని సూసైడ్ లేఖలో వేణు కుమార్ వెల్లడించాడు. ప్రస్తుతం ఐసీయూలో ఉన్న వేణు ఆరోగ్య […]

ఏపీ ప్రభుత్వంపై ఉద్యోగుల ఆగ్రహం – ఉద్యమ శంఖారావం

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు , కార్మికుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం దిశగా ఏపీ జేఏసీ మరోసారి పోరుబాట పట్టింది. బకాయిలు పడిపోయిన ఆర్థిక లబ్ధులు, నిలిచిపోయిన డీఏలు మరియు నూతన వేతన సవరణ సంఘం నియామకంపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలని ఏపీ జేఏసీ డిమాండ్ చేసింది. ప్రభుత్వం నుంచి తగిన స్పందన రాకపోతే వచ్చే రోజుల్లో సచివాలయ ముట్టడి, కలెక్టరేట్ల వద్ద మహాధర్నాలు, నిరవధిక సమ్మె దిశగా కార్యాచరణను ఉధృతం చేస్తామని […]

సిజెపి వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కేకు అస్వస్థత

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే శనివారం అస్వస్థతకు గురయ్యారు. మహారాష్ట్ర లోని ఛత్రపతి శంభాజీనగర్‌లో తన నివాసం వద్ద ప్రజలను కలుసుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా అసౌకర్యం అనిపించి ఇంట్లోకి వెళ్లగానే ఆయనకు వాంతులు, నీళ్ల విరేచనాలు అయ్యాయని డాక్టర్ చెప్పారు. దీప్కే రక్తపోటు స్వల్పంగా తక్కువ స్థాయిలో 100/60లో ఉందన్నారు. ఒత్తిడి, ఆందోళన కారణంగా ఉదయం నుంచి ఆయనకు వికారంగా ఉందన్నారు. రెండుసార్లు ఆయనకు వాంతులు, నీళ్ల విరేచనాలు అయ్యాయన్నారు. ప్రస్తుతానికి ఆయనకు జ్వరం లేదని, విశ్రాంతి […]

ఏపీలో థింసా నృత్యంపై కాక్రోచ్ పార్టీ రియాక్ష‌న్‌!

కాక్రోచ్ జనతా పార్టీ ఏపీలో జరిగిన భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభోత్సవంపై స్పందించింది. థింసా నృత్యాన్ని ప్రదర్శించి మోదీకి స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన వీడియోను ఓ జాతీయ మీడియా ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. దీనికి రిప్లై ఇస్తూ కాక్రోచ్ పార్టీ మరో పోస్టు చేసింది. ఈ కార్యక్రమం ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బుతో నిర్వహిస్తున్నారా? అని కామెంట్ చేసింది. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.

ఏపీలో నీట్ కౌన్సెలింగ్‌ షెడ్యూల్ రిలీజ్

ఏపీలో వైద్య విద్య కోర్సుల ప్రవేశాల కోసం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నీట్ యూజీ 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇవాళ విడుదల చేసింది. ఆగస్టు 4 నుంచి తొలి విడత కౌన్సెలింగ్, రాష్ట్ర కౌన్సెలింగ్ ఆగస్టు 13 నుంచి 22వ తేదీ వరకు, చేరిన అభ్యర్థుల వివరాల రాష్ట్రస్థాయి ధృవీకరణ ఆగస్టు 29న నిర్వహిస్తారు. తొలి విడత అఖిల భారత కోటా కౌన్సెలింగ్‌లో చేరేందుకు ఆగస్టు 22, 2026 చివరి తేదీ, రాష్ట్ర కౌన్సెలింగ్‌ చేరికకు ఆగస్టు […]

కేరళలో భారీ వర్షాలు.. కొండచరియలు విరిగిపడి నలుగురి మృతి

కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇడుక్కి, కొట్టాయం జిల్లాలో కొండచరియలు విరిగిపడి నలుగురు మృతి చెందగా.. పలువురు చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు ఎన్టీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. పతనంతిట్ట జిల్లాలో భారీ వర్షానికి పంపానది పోటెత్తింది. రాన్వీపట్టణం సహా పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. నడుములోతు వరకు నీరు చేరడంతో బోట్లసాయంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

సరైన నియంతగా మారడంలో ప్రధాని విఫలం.. బీజేపీ నేత పూనావాలా

ప్రధాని మోదీపై బీజేపీ నేత పూనావాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ ప్రధాని పదవి చేపట్టి 12 ఏళ్లు అవుతోందని, అయినప్పటికీ సరైన నియంతగా మారడంలో ఆయన విఫలమయ్యారని పూనావాలా వ్యాఖ్యానించారు.దీనిలో పరోక్షంగా ప్రధాని మోదీకి మద్దతు తెలిపారు. రాహుల్ గాంధీని చూడండి. ఆయన జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధాకి వారసుడు. మోదీజీ.. నిజమైన నియంతృత్వం అంటే ఏంటో, ఎమర్జెన్సీ అంటే ఏంటో వారిని చూసి నేర్చుకోండి. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై విమర్శలు చేశారు.

స్టాలిన్ కు రాహుల్ కీలక పిలుపు..! డీలిమిటేషన్ బిల్లు వేళ కీలక పరిణామం..!

డీలిమిటేషన్ బిల్లును మరోసారి పార్లమెంట్ ముందుకు తెస్తోంది బీజేపీ.. టీఎంసీ, ఆప్, శివసేన పార్టీల్ని చీల్చి, ఆ ఎంపీల మద్దతు కూడా కలుపుకుని డీలిమిటేషన్ బిల్లు నెగ్గించుకోవాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో లోక్ సభలో విపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు. విజయ్ కు తాము మద్దతివ్వడంపై గుర్రుగా ఉన్న మాజీ సీఎం, డీఎంకే అధినేత స్టాలిన్ ను ఉద్దేశించి ఇవాళ ఓ కీలక పిలుపునిచ్చారు. పైకి మాత్రం అన్ని తమిళ పార్టీలకూ, ఎంపీలకు […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON