కామన్వెల్త్ క్రీడల్లో భారత్కు మరో రెండు స్వర్ణ పతకాలు వచ్చాయి. మహిళల 51 కేజీల విభాగంలో సాక్షి చౌదరి స్వర్ణం గెలుచుకుంది. ఫైనల్లో రూబీ వైట్(ఇంగ్లాండ్)ను ఓడించి విజేతగా నిలిచింది. ఆ తర్వాత మహిళల 60 కేజీల విభాగంలో ప్రియా ఘంఘాస్ కూడా బంగారు పతకం సాధింంచింది. ఫైనల్లో కెనడాకు చెందిన మేరీ అల్-అహ్మదీహ్ 4-1తో తేడాతో మట్టికరిపించి స్వర్ణం ఎగరేసుకుపోయింది. ఇప్పటివరకు బాక్సింగ్ భారత్ నాలుగు స్వర్ణ పతకాలు సాధించింది. బాక్సింగ్ ఒక ఎడిషన్లో ఇన్ని పతకాలు రావడం ఇదే తొలిసారి.