డీలిమిటేషన్ బిల్లును మరోసారి పార్లమెంట్ ముందుకు తెస్తోంది బీజేపీ.. టీఎంసీ, ఆప్, శివసేన పార్టీల్ని చీల్చి, ఆ ఎంపీల మద్దతు కూడా కలుపుకుని డీలిమిటేషన్ బిల్లు నెగ్గించుకోవాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో లోక్ సభలో విపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు. విజయ్ కు తాము మద్దతివ్వడంపై గుర్రుగా ఉన్న మాజీ సీఎం, డీఎంకే అధినేత స్టాలిన్ ను ఉద్దేశించి ఇవాళ ఓ కీలక పిలుపునిచ్చారు. పైకి మాత్రం అన్ని తమిళ పార్టీలకూ, ఎంపీలకు అని రాహుల్ పేర్కొన్నారు.