గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత పారా అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల షాట్పుట్ ఎఫ్-57 ఫైనల్లో సోమన్ రాణా పసిడి పతకం సాధించగా, శుభమ్ జుయాల్ రజత పతకం గెలిచాడు. రాణా 13.40 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానంలో నిలువగా.. శుభమ్ 13.28 మీటర్ల త్రోతో రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. శుభమ్ జుయాల్, సోమన్ రాణా పతకాలతో భారత్ ఖాతాలో పతకాల సంఖ్య 30కి (8 స్వర్ణాలు, 15 రజతాలు, 7 కాంస్యాలు) చేరింది.