loader

ఎపిలో కరోనా కేసుల విజృంభణ.. 49కి చేరిన కోరోనా కేసులు

ఎపిలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. తిరుపతిలో తొలి కరోనా కేసు నమోదయింది. శనివారం ఒక్కరోజే ఎపిలో మరో 10 మందికి పైగా కరోనా బారిన పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 49కి చేరగా, ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో 24 మంది చికిత్స పొందుతున్నారు. ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో కొత్త కేసులు వెలుగుచూడగా, కృష్ణా, తిరుపతి, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైంది. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనాతో నలుగురు మృతి చెందినట్లు వైద్యశాఖ […]

హైకోర్టు ఆదేశాలపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్..

హైడ్రా కమిషనర్‌గా రంగనాథ్‌ను తొలగించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రంగనాథ్ స్పందించారు. తాము రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగానే పనిచేస్తున్నామని, చెరువులు, ప్రభుత్వ ఆస్తులను కాపాడటమే హైడ్రా ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. న్యాయవ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని.. ఆ కేసులన్నింటినీ చట్టపరంగానే ఎదుర్కొంటానని ఆయన అన్నారు. అయితే హైకోర్టు ఆదేశాలపై ఆచితూచి స్పందించాలని ప్రభుత్వం నభావిస్తోంది. రంగనాథ్ విషయంలో వేచి చూసే ధోరణిలో ముందుకు సాగాలని యోచిస్తోంది. తీర్పునకు సంబంధించిన ఆర్డర్ కాపీ ఆధారంగా న్యాయసలహా […]

ఎన్టీఆర్‌ భుజానికి గాయం

ప్రముఖ నటుడు ఎన్టీఆర్ గాయపడ్డారు. సోమవారం సాయంత్రం భుజానికి స్వల్ప గాయమైనట్లు ఆయన కార్యాలయం తెలిపింది. డా.జె. మధుసూదన్రావు, డా.ఆర్.ఎ. పూర్ణచంద్ర తేజస్వి నేతృత్వంలోని బృందం పూర్తిస్థాయి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించింది. ఎన్టీఆర్ పూర్తిగా కోలుకునేందుకు 6-8 వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు తెలిపింది. అభిమానులు, శ్రేయోభిలాషులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఎన్టీఆర్ ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తామని పేర్కొంది.

పంజాబ్‌లో బీజేపీకి షాక్.. మళ్లీ ఉద్యమ బాటపట్టిన రైతులు

పంజాబ్‌‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. భారత్-అమెరికా ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా వేలాది మంది రైతులు మరోసారి శంభు సరిహద్దు వద్ద గుమిగూడారు. వారిని ఢిల్లీ వైపు వెళ్లనీయకుండా హరియాణా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడి పరిస్థితులు 2020-21 వ్యవసాయ చట్టాల ఉద్యమం, 2024 అన్నదాతల ఆందోళనలను గుర్తుచేస్తున్నాయి. అమెరికా నుంచి భారీ సబ్సిడీలతో వచ్చే వ్యవసాయ, పాల ఉత్పత్తులు భారత మార్కెట్‌లోకి ప్రవేశించే అవకాశముందని రైతు సంఘాలు ఆందోళన […]

‘మిషన్ శక్తిశాట్’కి ఎంపికైన AP విద్యార్థిని జెస్సీ.. మంత్రి లోకేష్ అభినందనలు

ప్రపంచంలోనే తొలి ఆల్-గర్ల్స్ గ్లోబల్ లూనార్ క్యూబ్ శాట్ ‘మిషన్ శక్తిశాట్’ కు ఎంపికైన తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరానికి చెందిన కందుల జెస్సీ, మిషన్ శక్తిశాట్ డైరెక్టర్ శ్రీమతి కేశన్ తో కలిసి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను కలిశారు. ధవళేశ్వరం జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న కందుల జెస్సీ.. ‘మిషన్ శక్తిశాట్’ ఎంపికై రికార్డ్ సృష్టించారు. మిషన్ శక్తిశాట్ కు ఎంపికై రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారని ఈ సందర్భంగా […]

శివానీ మృతి నన్ను తీవ్ర విషాదంలోకి నెట్టేసింది : చంద్రబాబు

ముర్రం శివాని ఆత్మహత్యపై సీఎం చంద్రబాబు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఇటీవల రంపచోడవరంలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో వేదికపై ఎంతో ఉత్సాహంగా మాట్లాడిన శివాని ఆత్మహత్య ఆవేదన కలిగించింది. తన చదువు, ఉన్నత లక్ష్యాల గురించి శివాని నాతో చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి. కారణాలు ఏవైనా తన కలలు నిజం కాకుం డానే ఆ విద్యార్ధిని తనువు చాలించడం నన్ను కలిచివేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా మీకు అండగా ఉంటుందని’ చంద్రబాబు హామీ […]

హైడ్రా కమిషనర్ గా రంగనాధ్ ను తొలిగించండి- హైకోర్టు సంచలన ఆదేశాలు..!!

హైకోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చింది. హైడ్రా కమిషనర్ రంగనాధ్ ను వెంటనే హైడ్రా కమిషనర్ పదవి నుంచి తప్పించాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. కోర్టు సూచన చేసినా అమలు చేయకపోవటం పైన హైకోర్టు సీరియస్ అయింది. హైడ్రా పరిధిని మించి ప్రైవేటు స్థలాల విషయాల్లో తీసుకుంటున్న నిర్ణయాల పైన అభ్యంతరం వ్యక్తం చేసింది. రంగనాధ్ స్థానంలో ఐజీ స్థాయి అధికారికి హైడ్రా కమిషనర్ గా బాధ్యతలు అప్పగించాలని ఆదేశించింది.

బోండా ఉమా వ్యవహారంలో కీలక మలుపు, తాజా నిర్ణయంతో..!!

ముద్రగడ కారణంగానే 2019 లో పార్టీ ఓడిపోయిందనే బోండా ఉమా  వ్యాఖ్యల పైన పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, తాను వైసీపీ నిర్వహించిన సభకు వెళ్లలేదని… జనసేన మాజీ నేత దాసరి రాము నిర్వహించిన ముద్రగడ సంతాప సభకు హాజరయ్యనని బోండా ఉమా చెబుతున్నట్లు తెలుస్తోంది. అయితే.. వైసీపీ నేత జక్కంపూడి రాజా గోదావరి లో నిర్వహించిన ముద్రగడ సంతాప సభకు జ్యోతుల నెహ్రూ, వంగవీటి రాధ వచ్చిన విషయాన్ని బోండా ఉమా సన్నిహితులు […]

విద్యార్థుల గొంతు నొక్కడానికే మోడీ ప్రభుత్వం ప్రయత్నం: రాహుల్ గాంధీ

బిహార్ లో విద్యార్థులపై కాల్పులు జరిగాయంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. విద్యార్థులపై ఎఫ్ఐఆర్ లు ఉండవని కేంద్రం ఇచ్చిన హామీ ఏమైంది? అని ప్రశ్నించారు. విద్యార్థులను అరెస్టు చేసి ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారని రాహుల్ గాంధీ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఢిల్లీలో పెల్లెట్లు, పాట్నాలో ఎకే 47 ప్రయోగించారని రాహుల్ గాంధీ విమర్శించారు. విద్యార్థులను అణిచివేయడంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ తీరు ఎక్కడైనా ఒక్కటేనని, విద్యార్థులకు మోడీ క్షమాపణ చెప్పాల్సిందేనని […]

పాక్ బాక్సర్‌ను చిత్తు చేసిన భారత యోధుడు..

కామన్వెల్త్ గేమ్స్ లో భారత బాక్సింగ్ విభాగానికి శుభారంభం లభించింది.భారత యువ బాక్సింగ్ సంచలనం జాదుమణి సింగ్ ప్రిక్వార్టర్స్‌ (రౌండ్ 16)లో పాకిస్థాన్‌కు చెందిన బాక్సర్ సుమామ రెహమాన్‌ను చిత్తుగా ఓడించి క్వార్టర్ ఫైనల్స్‌కు సగర్వంగా దూసుకెళ్లాడు. ఉత్కంఠభరితంగా జరిగిన రౌండ్-16 పోరులో 22 ఏళ్ల మణిపూర్ బాక్సర్ జాదుమణి సింగ్ ఆరంభం నుంచే ప్రత్యర్థిపై ఆధిక్యం ప్రదర్శించాడు. 1999 కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్‌పై భారత్ సాధించిన రోజున పాక్ బాక్సర్‌పై భారత్ విజయం సాధించడంతో జాదుమణి […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON